సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

0చూసినవారు
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
భైంసా పట్టణంలో కొందరు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించి, మార్ఫింగ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తూ మత విద్వేషాలు, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనేలా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో, నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను గుర్తించి తొలగించారు. త్వరలోనే సంబంధిత వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్