నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. జిల్లా సహా సంయోజక్ శివ మాట్లాడుతూ, భారతదేశంపై అమెరికా, చైనా, టర్కీ దేశాలు చేస్తున్న ఆర్థిక యుద్ధం గురించి వివరించారు. స్వదేశీ నినాదాన్ని జీవన విధానంగా అలవర్చుకోవాలని, స్వదేశీ వస్తువులను వాడాలని విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.