ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దు

744చూసినవారు
ఇంటర్మీడియట్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లో గల కేజీబీవీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం జీవితంలో అంతిమం కాదని, భయాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.