కుంటాల మండలం లింబా(కె) గ్రామానికి చెందిన సూర్యవంశీ పండిత్ అనే ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య అంజనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.