భక్తుల ఆధ్యాత్మిక యాత్రను సులభతరం చేసేందుకు నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్ర దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ పండరి మంగళవారం తెలిపారు. ఈనెల 8న పూరి యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్నవరం, సింహాచలం, అర్సవెల్లి, కోణార్క్, పూరి జగన్నాథ్, విశాఖపట్నం, ద్వారక తిరుమల పుణ్యక్షేతులకు ఈ యాత్ర వెళ్తుందని, ఒక్కొక్కరికి చార్జీ రూ. 6,400 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382842582 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.