కడ్తాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం కారణంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ ను గతంలో సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం, హెచ్ఎం ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వెంకటేశ్వర్ మంగళవారం పాఠశాలలో తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.