కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి ఉచిత శిక్షణతో పాటు పనిముట్లు అందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లో బుధవారం ఆయన లబ్ధిదారులకు పనిముట్లు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతి వృత్తుల వారి అభ్యున్నతికి ఈ పథకాన్ని ప్రారంభించారని, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషితో అన్ని గ్రామాల్లో ఈ పథకం అమలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.