
గ్యాస్ కొరత: సెల్ టవర్ ఎక్కి ఆటో డ్రైవర్ల నిరసన
హైదరాబాద్‌లో గ్యాస్ కొరత తీవ్రమైంది. అత్తాపూర్‌లో ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎల్పీజీ దొరకట్లేదని సెల్ టవర్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. రాజేంద్రనగర్ శివరాంపల్లి సబ్‌స్టేషన్ వద్ద రోడ్డుపై కూర్చుని ఆందోళన చేశారు. గంటల తరబడి లైన్లో నిలబడినా రూ.500 విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, ఇది తమ రోజువారీ పనికి సరిపోవడం లేదని డ్రైవర్లు ఆరోపించారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఘర్షణల వల్ల సరఫరాకి అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల ఆటో డ్రైవర్లు, హోటళ్లు, గృహాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరాను పెంచాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.




