తహసిల్దార్ విశ్వంభర్ సేవలు మరువలేనివి

1చూసినవారు
దస్తురాబాద్ తహసిల్దార్ బత్తుల విశ్వంభర్ ఉద్యోగ విరమణ సందర్భంగా కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, విశ్వంభర్ తన ఉద్యోగ జీవితంలో రెవెన్యూ శాఖకు చేసిన సేవలు వెలకట్టలేనివని, అవి మరువలేనివని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, క్రమశిక్షణతో పనిచేస్తూ అధికారుల మెప్పు పొందారని తెలిపారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సాగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :