ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jun 03, 2026, 07:06 IST/

తెలంగాణకు OG కేసీఆర్: కేటీఆర్

Jun 03, 2026, 07:06 IST
తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశభక్తి, పోరాటాల గురించి పవన్ కల్యాణ్ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణకు OG కేసీఆర్ ఉన్నారని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్‌ను ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తామని, సోదరుడిగా వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతామని, కానీ తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదని అన్నారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని ఆయన నొక్కి చెప్పారు.