తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బుధవారం ఖరారు చేసింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. పట్టభద్రులలో పార్టీ బలాన్ని పెంచేందుకు అనుభవజ్ఞులకే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.