నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో ఉన్న శ్రీ ఆంజనేయ శివ పంచాయతన నవగ్రహ ఆలయం యొక్క ఏడవ వార్షికోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో వేద పండితులు సాయి దేశ్ పాండే నేతృత్వంలో అంజనీపుత్రుడికి పంచామృతాలతో అభిషేకాలు, పుణ్యా వచనం, హోమం, గణపతి పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.