భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఆలయ 11వ రోజు వేడుకలు వైభవంగా

3చూసినవారు
భోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఆలయ 11వ రోజు వేడుకలు వైభవంగా
నిర్మల్ జిల్లా, ముథోల్ మండలంలోని భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక ఆలయంలో 11వ రోజు వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన కాకడ హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వినాయక భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్