కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రచార జీబు జాత ఈ నెల 21న బాసరలో ప్రారంభమై 23న నిర్మల్ లో ముగుస్తుందని పేర్కొన్నారు. లేబర్ కోడ్స్, విబి రామ్ జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.