జిల్లా ఇన్చార్జ్ మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

0చూసినవారు
జిల్లా ఇన్చార్జ్ మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్
నిర్మల్ జిల్లాలో శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆయనకు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆర్డీఓ దేవిదాస్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు కూడా మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్