ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, యువతకు ఉద్యోగ కల్పన కొరకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. వచ్చే నెల 6వ తేదీన ఆదిలాబాద్ లో జరిగే ఈ జాబ్ మేళాలో అర్హులైన నిరుద్యోగ యువత పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. పోస్టర్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా https://satg.telangana.gov.in/prajapalana వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.