వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ, మంచి నీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తీవ్రమైన ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సామాజిక బాధ్యతతో ఈ ఏర్పాట్లు చేయడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.