నిర్మల్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సీఎన్జీ పెట్రోల్ బంకులో ఉచిత గాలి నింపే యంత్రం కేవలం ప్రదర్శనకే పరిమితమైంది. యంత్రం చెడిపోయిందని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతతో టైర్లు పేలే ప్రమాదం ఉన్నా, పట్టణంలోని 99 శాతం బంకుల్లో ఈ సౌకర్యం లేకపోవడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.