
వైభవ్ తో చిన్నారుల సెల్ఫీ.. ఫోటోకు రూ.100 ఇవ్వాలని సరదా
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన సరదా స్వభావంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తనతో ఫోటో దిగేందుకు వచ్చిన ఇద్దరు చిన్నారులను, ఒక్కో ఫోటోకు రూ.100 ఇవ్వాలని ఆటపట్టించారు. వారు నిజంగానే డబ్బులు ఇస్తామనడంతో నవ్వేసిన వైభవ్.. సరదాగా అన్నానని చెబుతూ వారితో ఫోటోలు దిగి మురిపించారు. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




