డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ

2చూసినవారు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏఎస్పీ సాయి కిరణ్ నేతృత్వంలో సోమవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ గంజాగస్తి' పేరుతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో మైనర్లు కూడా ఉన్నారని, వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. యువత రాత్రి సమయంలో రోడ్లపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్