ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి

0చూసినవారు
ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి
జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు పురోగతి, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you