మామడ మండలం పొన్కల్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర ఇస్తామని తెలిపారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.