పిల్లల ఆనందమే అసలైన గెలుపు..: అబిషేక్ సింగంసెట్టి

0చూసినవారు
పిల్లల ఆనందమే అసలైన గెలుపు..: అబిషేక్ సింగంసెట్టి
నిర్మల్ జిల్లాలోని నిర్మల్ లో విన్నర్స్ హై స్కూల్ లో మంగళవారం Happy Parenting కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సెలర్, ఇన్స్పిరేషనల్ స్పీకర్ అబిషేక్ సింగంసెట్టి, పిల్లల పెంపకం, స్నేహపూర్వక సంబంధాలు, వారి ప్రతిభను అర్థం చేసుకోవడం వంటి అంశాలపై తల్లిదండ్రులకు ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. పిల్లల విజయం మాత్రమే కాదు వారి ఆనందమే మన అసలైన గెలుపు" అనే సందేశంతో ఆయన తల్లిదండ్రులను మోటివేట్ చేశారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో చైర్మన్ కొమ్మ ప్రసాద్, కరెస్పాండెంట్ శ్రవణ్, డైరెక్టర్లు శిరీష్, రఘు, హరిచందన్, డీన్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్