బాసర బాల ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

1చూసినవారు
బాసర బాల ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలోని ప్రధాన ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు నూతనంగా నిర్మించిన బాల ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఆదివారం ప్రతిష్ఠించారు. ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. శృంగేరి పీఠానికి చెందిన పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో మధ్యాహ్నం 1 గంట నుండి అమ్మవారి దర్శనాలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్