దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

1చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సమ్మె కరపత్రాలను ఆవిష్కరిస్తూ, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్