కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను నిర్వహించాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సమ్మె కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు, ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన్ కుమార్, తిరుపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.