తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు సుజాత, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో, ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న 10 లక్షల మంది ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.