జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించారా లేదా అని పరిశీలించి, నామినేషన్లు దాఖలు చేసే వారికి కుల ధ్రువపత్రాల జారీ, బ్యాంకు ఖాతాలు తెరవడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు.