సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, సోన్ మండలం సంగంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ విలాస్ తో పాటు 30 మంది బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి కాషాయ జెండా ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.