వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ముగించాలి

0చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ముగించాలి
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ముగించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్, రేవోజిపేట్ గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. మండలంలోని మొత్తం కొనుగోలు కేంద్రాలు, వచ్చిన పంట దిగుబడి, కొనుగోలు చేసిన ధాన్యం, గోదాములకు, మిల్లులకు తరలించిన ధాన్యం, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం, అందుబాటులో ఉన్న హమాలీలు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్