మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బూత్ నిర్మాణ అభియాన్ కార్యశాల నిర్వహించారు. పార్టీ భవిష్యత్ విజయాలకు బూత్ స్థాయి పటిష్టతే పునాది అని, ప్రజలతో మమేకమై, పార్టీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన సూచించారు.