రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సేవకుల పథ సంచలనం నిర్వహించారు. దేవరకోట దేవాలయం, ఏఎన్ రెడ్డి కాలనీ, ఆర్కే కన్వెన్షన్ హాల్ నుండి స్వయం సేవకులు రూట్ మార్చ్ నిర్వహించగా, పట్టణంలో సందడి నెలకొంది. దారి పొడవున మహిళలు పూలవర్షంతో స్వాగతం పలకగా, క్రమపద్ధతిలో సాగిన వారి తీరు పట్టణవాసులను ఆకట్టుకుంది.