రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వయంసేవకుల పథ సంచలన్ (రూట్ మార్చ్)ను విజయవంతం చేయాలని నగర సంఘ చాలక్ డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరపత్రాలు ఆవిష్కరించిన ఆయన, ఈ నెల 4న మధ్యాహ్నం మూడు గంటలకు దేవరకోట ఆలయం, ఆర్కే కన్వెన్షన్ హాల్, ఏఎన్ రెడ్డి కాలనీ నుండి పథ సంచలన్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సార్వజనికోత్సవ సభ జరుగుతుందని తెలిపారు.