నిర్మల్ జిల్లా, ఆడెల్లి నుంచి బోథ్ వెళ్లే ప్రధాన రహదారి రవీంద్రనగర్ అటవీ ప్రాంతంలో పూర్తిగా గుంతలమయమైంది. కొత్తగా నిర్మించిన రోడ్డు కూడా దెబ్బతినడంతో ప్రయాణికులు మరియు ఆడెల్లి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.