ఓం నమః శివాయ" నామస్మరణతో మారుమోగిన పాప హరేశ్వర ఆలయ ప్రాంగణం
నిర్మల్ జిల్లా బాసరలోని పాప హరేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య శివలింగానికి పాలు, పంచామృతాలతో అభిషేకం, బిల్వార్చనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బాసర గ్రామానికి రక్షణ దైవంగా కొలువైన పాప హరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పాప హరేశ్వరుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణం "ఓం నమః శివాయ" నామస్మరణతో మారుమోగింది.