జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గురువారం పట్టణంలోని విజయ్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ లో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లను నిర్ణీత గడువులోగా ముద్రించాలని, ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముద్రణ కేంద్రంలోకి అనధికార వ్యక్తులను అనుమతించరాదని, ప్రక్రియ పూర్తయ్యేంతవరకు పటిష్ట పోలీసు బందోబస్తు కొనసాగించాలని సూచించారు. ముద్రణ విధులు కేటాయించిన సిబ్బంది తీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.