ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ, ఆదివాసులపై అటవీశాఖ అధికారుల నిరంకుశ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని కోరారు. పెంబి మండలంలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని గత ఐదు రోజులుగా దీక్ష చేపడుతున్నారని, ఈ విషయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏరియా కమిటీ సభ్యులు డాకుర్ తిరుపతి, సుంచుల నారాయణ, ఖానాపూర్ పట్టణ కార్యదర్శి పానగంటి నరేష్ కుమార్ పాల్గొన్నారు.