నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని అన్నారు. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని, పేదల కోసం ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.