ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అటవీ సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై నినాదాలు చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు అన్నారు. జీవ వైవిధ్యంతో మానవ మనుగడ అడవులతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రాథోడ్ రమేష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సంతోష్, నజీర్ ఖాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.