ఓటర్ నమోదులో బీఎల్ఏల పాత్ర కీలకం

0చూసినవారు
ఓటర్ నమోదులో బీఎల్ఏల పాత్ర కీలకం
ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం నిర్మల్ జిల్లాలో బీఎల్ఏ ఇంచార్జీల సమావేశంలో మాట్లాడుతూ, ఓటర్ నమోదులో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏల) పాత్ర కీలకమని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎల్ఏలు తమ గ్రామాల్లో ఓట్లను గుర్తించడం ద్వారా బీజేపీ చేస్తున్న ఓట్ చోరీని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీలోపు బీఎల్ఏల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్మల్ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులు డీసీసీ అధ్యక్షులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్