మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం బైంసా పట్టణంలో మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. నిర్మల్ జిల్లాలో అత్యధిక స్థానాల్లో బీజేపీ బలపరిచిన సర్పంచులు గెలుపొందడం హర్షనీయమని పేర్కొన్నారు.