నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాద్రిపేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుముల శ్రవణ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసే విధంగా ప్రతీ కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.