ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం మరింత పెరిగింది

2చూసినవారు
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం మరింత పెరిగింది
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం గణపతి గౌరీ పూజ, కలశస్థాపిత దేవత పూజ, వాసవిమాత హోమ కార్యక్రమాలు, లక్ష పుష్పార్చన జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారిక పండుగగా నిర్వహించడం ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని పట్టణ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్