నిర్మల్ జిల్లా కేంద్రంలోని 108 కార్యాలయంలో గురువారం జాతీయ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందిస్తూ, రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఎంతటి మారుమూల ప్రాంతానికైనా సేవలందిస్తూ 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, ఈఎంఈ లింగాచారి తదితరులు పాల్గొన్నారు.