శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మిల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరై, ప్రతీ ఉద్యోగి ప్రస్థానంలో పదవీ విరమణ ఒక సహజ ప్రక్రియ అని అన్నారు. ప్రజలకు నిరంతరం సేవలందించి ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకున్న అధికారులను ఆయన అభినందించారు.