సోయాబీన్ పంట మృత్యుపాశమైంది

4చూసినవారు
సోయాబీన్ పంట మృత్యుపాశమైంది
బుధవారం రాత్రి సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ ద్విచక్ర వాహనంపై నిర్మల్ వెళ్తుండగా, నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామ సమీపంలో రోడ్డుపై ఆరబెట్టిన సోయాబీన్ పంటపైకి వెళ్లి అదుపుతప్పి మృతి చెందాడు. పద్మయ్య అనే రైతు తన సోయాబీన్ పంటను రోడ్డుపై ఆరబెట్టి, నల్లని టార్పాలిన్ కవర్ కప్పాడు. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.

ట్యాగ్స్ :