బుధవారం సోన్ మండలం న్యూ వెల్మల్ బొప్పారం గ్రామంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో 'స్వదేశీ కొరకు పరుగు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహా సంయోజక శివ మాట్లాడుతూ, భారతదేశంపై అమెరికా, చైనా, టర్కీ దేశాలు చేస్తున్న ఆర్థిక యుద్ధంపై గ్రామస్తులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని జీవన విధానంగా అలవర్చుకోవాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు మనోహర్ పాల్గొన్నారు.