నిర్మల్ జిల్లా, ఖానాపూర్ పట్టణంలో గోదావరి తీరాన ఉన్న తాతమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై శాలివాహన సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.