ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు మండల సర్పంచులతో బుధవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమావేశమయ్యారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో బోర్వెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామసభల ద్వారా ప్రజలకు వివరించాలని, ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు.