దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: శ్రీహరి రావు

0చూసినవారు
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: శ్రీహరి రావు
నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్యుడు సంతోష్ రాజుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు డిమాండ్ చేశారు. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన, నిందితులను వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోరారు. దాడి చేసినవారు ఒక మతానికి చెందినవారైనప్పటికీ, ఈ సంఘటనకు మత రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని, మతవాద రాజకీయ పార్టీలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్